రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలి: కలెక్టర్
NEWS Sep 05,2024 03:51 pm
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. భైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని, సరిపడినన్ని బెడ్లు, మందులు, ఇతర వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు.