మట్టి విగ్రహాలు పంపిణీ చేయాలి
NEWS Sep 05,2024 03:54 pm
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆద్వర్యంలో తయారు చేసిన 2 వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆద్వర్యంలో తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను జిల్లాసమీకృత కార్యాలయాల సముదయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా పంపిణీ చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, ఆయా గ్రామాల్లో విగ్రహాలు పంపిణీ చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.