గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భైంసా పట్టణంలో ఏఎస్పి అవినాష్ కుమార్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బైంసాలో పట్టణంలో దాదాపు 200 గణేశుని మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.