నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి
NEWS Sep 05,2024 03:53 pm
విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.