ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కప్‌ను
ఆవిష్కరించిన MLA గంగుల కమలాకర్
NEWS Sep 05,2024 04:08 pm
ఈనెల 14, 15వ తేదీలలో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఓవరాల్ కప్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, స్థానిక నాయకులు, రాష్ట్ర చైర్మన్ వసంత్ కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే టోర్నమెంట్ ఆర్గనైజర్ ప్రసన్న కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు.