సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరానగర్ పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడిపోయింది. ఆ సమయంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్ళగానే వరండా పైకప్పు పెచ్చులూడి పోయాయి. నిర్మాణం చేపట్టిన 15 ఏళ్లకే పై కప్పు పెచ్చులు ఊడిపోవడంతో నాణ్యతను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల వర్షం పడినప్పుడు నీరు కారుతున్నట్లు పేర్కొన్నారు.