శ్రావణమాసం ముగింపు ఉత్సవాలు
NEWS Sep 05,2024 04:33 pm
నాగల్ గిద్ద మండలం మేగ్యా నాయక్ తండా శ్రీ భవాని మాత మందిరంలో శ్రావణ మాసం ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. దేవి దాస్ మహారాజ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రావణమాసం ముగింపు ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని దేవిదాస్ మహారాజు ఆశీస్సులు తీసుకున్నారు. తాజా మాజీ సర్పంచ్ అనిత శివరాం, నాయకులు వెంకట నాయక్, రాథోడ్ లక్ష్మణ్, పర్లాల్, దిగంబర్ పాల్గొన్నారు.