ఆ పనులకు మినహాయింపు ఇవ్వండి
NEWS Sep 05,2024 04:35 pm
అరకు: సచివాలయ పశుసంవర్ధక శాఖ సహయకులకు ఇతర శాఖల పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని జిల్లా పశు వైద్యాధికారుల సంఘం అధ్యక్షులు డా సాగరి గణేశ్వరరావు ఆధ్వర్యంలో అరకులోయ వచ్చిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సీహెచ్ నరసింహులుకి వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. ఇతర శాఖల పని అయిన సర్వే, బిఎల్ఓ పనులు ఎక్కువగా ఉండటంతో శాఖ పరమైన పశువులకు వ్యాక్సిన్లు వేయడం, పశుభీమా, పశు శాలల పనులలో వెనుకబడుతున్నామని తెలిపారు.