BJP సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Sep 05,2024 04:28 pm
అమలాపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహిళ మోర్చా జోనల్ ఇంచార్జి ఉమా మహేశ్వరి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతీ మహిళా సభ్యత్వ నమోదు ఎక్కువగా నమోదు చేయించాలని కోరారు. జిల్లా సభ్యత్వ కన్వీనర్ సత్యానందం మాట్లాడుతూ ఒక్కరు 200 సభ్యత్వాలు చేయించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు, రాజ్యలక్ష్మి, బేబీరాణి, భవాని పాల్గొన్నారు.