పుస్తకాలు మనకు మంచి మిత్రులు
NEWS Sep 05,2024 04:38 pm
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో డా. బొద్దుల లక్ష్మయ్య రచించిన పద్య నీరాజనం పుస్తకాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ ట్రెజరీ ఉపసంచాలకులు యు.నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు మనకు మంచి మిత్రులని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలని అన్నారు.