ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
NEWS Sep 05,2024 04:40 pm
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండలంలోని కనగర్తి పాఠశాలలో గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, కృష్ణ మూర్తి, ఉపాధ్యాయులు వాణి, కిషన్, శ్రీధర్, పవన్ ప్రసాద్, సంజన, కుమార స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.