విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
NEWS Sep 05,2024 04:41 pm
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రెవెన్యూ శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.