విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వపరంగా బాధితులకు అందుతున్న సహాయక చర్యలు గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల బాధితులకు ఆయన ఆహార పొట్లాలను అందజేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.