వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అరెస్ట్
NEWS Sep 05,2024 11:58 am
గుంటూరు: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. TDP కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామి తదితరులు కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులు కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్ళారు.