ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి
NEWS Sep 05,2024 12:00 pm
తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని.. తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుణ మాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో కేవలం 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఏక కాలంలో రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాదా అని ప్రశ్నించారు.