KMR: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా జనసమితి నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్త దానం చేశామని, కోదండరాం సార్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.