ఘనంగా టీచర్స్ డే వేడుకలు
NEWS Sep 05,2024 04:44 pm
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం హైస్కూల్ వద్ద ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వివేకానంద సేవా సమితి నాయకులు గనిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్ ఉపాధ్యాయులకు, ఎంపీ స్కూల్ ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్ లకు నాన్ టీచర్స్ స్టాఫ్ కి శాలువాలతో ఘనంగా సత్కరించి, స్వీట్ బాక్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో మల్లిబాబు మాస్టారు, యనమదల వెంకటరమణ, మణికంఠ పాల్గొన్నారు.