వెలుగు నింపేది ఉపాధ్యాయులే
NEWS Sep 05,2024 04:45 pm
చీకట్లో మగ్గుతున్న ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఉపాధ్యాయులేనని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలాగా తల్లిదండ్రులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపైనా ఉందన్నారు.