అరకు ఘాటీలో భారీ వర్షం కురుస్తుంది. ఘాటీ ప్రధాన రహదారి జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాహన చోదకులు అతి కష్టం మీద చాకచక్యంగా వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. అరకు నుండి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ సివి రమణ కొండలపై నుండి ఘాటీ రోడ్డుపై వస్తున్న నీటిలో అతి జాగ్రత్తగా బస్సును ముందుకు నడపడంతో బస్సు లోని ప్రయాణికులు డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.