వీవోఏ (యానిమేటర్ల) తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలక్టర్ షాన్ మోహన్‌కి వినతిపత్రం అందించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి 9 నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు.