ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధం అయ్యాడు. ఈ సారి ఖైరతాబాద్ లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని ప్రతిష్టించారు ఉత్సవ కమిటీ సభ్యులు. సెప్టెంబర్ 7 నుంచి నవరాత్రులు పూజలు అందుకోనున్నాడు. సెప్టెంబర్ 17న నిమజ్జనం చేస్తారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటారు.