వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలో నిర్వాహకుల, పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ నుంచి కూడా ఉచితంగా విద్యుత్తు అందజేస్తున్నందున అనుమతులు చేసుకోవాలని తెలిపారు. ఇబ్బందులు కలగకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉత్సవాలు ఉండరాదని సూచించారు.