ప్రస్తుతం బంగారం ధరలు రూ. 70 వేలకు అటూఇటుగా కొనసాగుతున్నాయి. గోల్డ్ చోరీలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇకపై 9 కేరెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 9 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.