ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
NEWS Sep 05,2024 04:48 pm
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా సిరిసిల్ల గీతానగర్ ఉన్నత పాఠశాలకి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు తడకల సురేష్ ఎన్నికైన సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున గీతనగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకి నిశారద, ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. క్రీడల్లో యోగా పోటీలలో విద్యార్థులను రాష్ట్రస్థాయిలో పాల్గొనేలా తీర్చిదిద్దినందుకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దినందుకు గాను జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.