సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఆరోపించింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ వెల్లడించింది. లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని ఆదిమూలం బెదిరించాడని బాధితురాలు తెలిపింది. అందరికీ తెలియాలని పెన్ కెమెరా పెట్టుకున్నానని బాధితురాలు తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను.. బాధితురాలు విడుదల చేసింది.