అరకులోయ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవంను జరుపుకున్నారు. ఈ మేరకు అరకులోయ లోని సీఏహెచ్ పాఠశాలలో జరిగిన మండల స్ధాయి ఉపాధ్యాయ దినోత్సవంలో మండల విద్యాశాఖ అధికారి-1 వంతాల త్రినాధరావు, మండల విద్యాశాఖ అధికారి-2 భారతీ రత్నం లను స్టేట్ బ్యాంక్ సిబ్బంది అరుణ్ కుమార్, క్రాంతికుమార్, రాజశేఖర్ దుస్సాలువాతో సత్కరించారు. ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న కిల్లో దుర్జో మాష్టారుకు వీడ్కోలు పలికారు.