టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే
కోనేటి ఆదిమూలం సన్పెన్షన్
NEWS Sep 05,2024 09:15 am
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సన్పెన్షన్ చేసింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ టీడీపీ అధిష్టానానికి లేఖ రాసింది. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని, కోనేటి తనకు పదేపదే ఫోన్ చేస్తూ, లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని ఆవేదన బాధిత మహిళ వ్యక్తం చేసింది. తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోలను టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది బాధిత మహిళ.