జియో 3 అదిరిపోయే ప్లాన్స్
NEWS Sep 05,2024 09:08 am
జియో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్ అందేలా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. రూ. 899, రూ. 999 త్రైమాసిక ప్లాన్‌లు, రూ. 3599 వార్షిక ప్లాన్‌తో సుమారు రూ. 700 విలువైన 3 ప్రయోజనాలను పొందేలా ఈ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 5 నుండి 10 మధ్య రీఛార్జ్ చేసుకునే జియో సబ్‌స్క్రైబర్‌లు ఈ ఆఫర్ పొందుతారు. రూ. 899 ప్లాన్ తో రోజుకు 2GB డేటా, 90 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అదేవిధంగా రూ. 999 ప్లాన్ తో రోజుకు 2GB డేటా, 98 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రూ. 3599 ప్లాన్‌లో 2.5 GB రోజువారీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. OTTకి సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రూ.175 విలువైన 28 రోజుల చెల్లుబాటుతో 10 GB డేటా ప్యాక్ ఇస్తున్నారు.