అరకు:అరకులోయ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరిపారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్, అధ్యాపకులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని ప్రిన్సిపాల్ తెలిపి, ఉపాధ్యాయ వృత్తి గొప్పతనం గురించి వివరించారు. అనంతరం విద్యార్ధులు ప్రిన్సిపాల్, అధ్యాపకులను సన్మానించారు.