తూర్పు గోదావరి జిల్లాలో 349.2 మిల్లీ మీటర్ల వర్షపాతం
NEWS Sep 05,2024 06:31 pm
తూర్పుగోదావరి జిల్లాలో గడచిన 24 గంటల్లో మొత్తం 349.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు గురువారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా గోకవరం మండలంలో 66.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది అన్నారు. అత్యల్పంగా చాగల్లు మండలంలో ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలియజేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.