ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం
NEWS Sep 05,2024 05:10 pm
హిందూపురం మండలం చౌలూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి బాలులే రేపటి పౌరులు, అందరూ బాగా చదువుకొని సమాజంలో బాధ్యతగా నడుచుకుని మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. గ్రామానికి చెందిన జనసేన నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, అట్టలు, స్వీట్లు సిఐ ఆంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేశారు.