ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
NEWS Sep 05,2024 08:08 am
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.