భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవ శిక్ష
NEWS Sep 05,2024 08:47 am
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. రూరల్ సీఐ దొరరాజు కథనం ప్రకారం.. ఏడిద గ్రామానికి చెందిన పైడిమళ్ల సుదర్శనరావుకు కపిలేశ్వరపురం మండలం కాలేరుకి చెందిన సుజాతతో వివాహం జరిగింది. సుదర్శనరావు వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని ఆమె ప్రశ్నించింది. దీంతో 2015 ఏప్రిల్‌లో భార్యను కొట్టి హత్య చేశాడని నేరం రుజువు కావడంతో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్ట్ శిక్ష విధించిందని తెలిపారు.