కోల్‌కతాలో హత్యాచారానికి, హత్యకు గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఈ మర్డర్ కేసులో పోలీసులు తొలి నుంచీ తమకు వ్యతిరేకంగానే ఉన్నారని, కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తూ ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ డబ్బులు ఆఫర్ చేశారని, మేం వెంటనే తిరస్కరించామని వైద్యురాలి తండ్రి చెప్పారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం క్యాండిల్స్ తో వైద్యురాలికి నివాళి అర్పించారు.