సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు స్పిల్ వే 4,6 గేట్స్ ను పైకెత్తి దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టుకు మంత్రి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 28.473 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.