ముఖ్యమంత్రులు రాజులేం కాదు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
NEWS Sep 05,2024 07:05 am
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, కీలక అధికారుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్‌గా ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమనుతాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.