విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం సహాయ నిధికి అమలాపురం రాజ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కె విశ్వనాథ్ 25 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ని కలిసి చెక్కును అందించారు. తన వంతు బాధ్యతగా సహాయం అందించిన విశ్వనాథ్ ను కలెక్టర్ అభినందించారు.