తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమొలులో గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వర్షాలు కారణంగా మలుపులో అదుపుతప్పి సమీపంలో జేసిబి వ్యాన్ ఉండడంతో దానిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న మున్నా అనే వ్యక్తి వెంటనే స్పందించి డ్రైవర్ ను రక్షించాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.