పెద్ద చెరువు నిండింది..
అలుగు పారింది..
NEWS Sep 05,2024 07:32 am
మెదక్ జిల్లాలోనే పెద్దదైన తూప్రాన్ పెద్ద చెరువు ఈరోజు ఉదయం నిండి అలుగు పారుతుంది. 750 ఎకరాల ఆయకట్టు కలిగిన తూప్రాన్ పెద్ద చెరువు నిండడంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1986 తర్వాత 30 ఏళ్ల పాటు పెద్ద చెరువు నిండకపోవడంతో ప్రజా గాయకుడు గద్దర్ చొరవతో హల్దీవాగు నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈసారి సైతం లిఫ్టుతో నీటి నింపే ప్రయత్నం చేసినప్పటికీ, భారీ వర్షాలతో పెద్ద చెరువు నిండింది.