సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలలో ప్రాజెక్టుకు 45,076 క్యూసెక్కులు వరద నీరు ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉ. 9:00 గంటల తరువాత ఎప్పుడైనా ప్రాజెక్టు వరద గేట్ల ఎత్తి వరద నీటిని విడుదల జరుగుతోందని వివరించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా పశువుల, గొర్రెల కాపర్లు, చేపల వేటకు వెళ్లేవారు నదిలోకి వెళ్ళరాదని విజ్ఞప్తి చేశారు.