వరద బాధితులను ఆదుకుందాం
NEWS Sep 05,2024 07:41 am
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది”అని అన్నారు. CMRFకి విరాళాలు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా, చెక్కులు, డీడీ రూపంలోగానీ లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి పంపవచ్చు.