అనన్య నాగళ్ళ, స్రవంతి సాయం
సాయంకు దూరంగా స్టార్ హీరోయిన్లు
NEWS Sep 04,2024 06:23 pm
ఆపదతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన టాలీవుడ్ హీరోయిన్లు స్పందించడం లేదు. సమంత, రష్మిక, తమన్నా, అనుష్క వంటి స్టార్ హీరోయిన్లు ఒక రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు. హీరోయిన్లు సిగ్గు పడేలా నటి అనన్య నాగళ్ళ, యాంకర్ స్రవంతి తమ వంతు సాయం చేశారు. అనన్య 2 రాష్ట్రాలకు 2.5 లక్షలు విరాళంగా ప్రకటించగా, స్రవంతి 2 రాష్ట్రాలకు లక్ష విరాళం అందించారు.