రేషన్ షాపులను తనిఖీ చేసిన రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు.
NEWS Sep 05,2024 06:39 am
పౌరసరఫరాల కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు మల్యాల మండలంలోని పలు చౌక ధరల దుకాణాలను రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. రేషన్ బియ్యం లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని, లబ్ధిదారులు ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దని టాస్క్ ఫోర్స్ అధికారి కృష్ణ, నాణ్యత ప్రమాణాల అధికారి రషీద్ పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు మరియు డీలర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫర అధికారులు శ్రీనివాస్, స్వామి, వంశీ పాల్గొన్నారు.