ఫ్యాకల్టీని తొలగించడం అన్యాయం
NEWS Sep 05,2024 07:45 am
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జెడ్పిటిసి కార్యాలయంలో బీఆర్ఎస్వి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్రీ అనిల్, జుబేర్ లు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకులాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు గెస్టు, పార్ట్ టైం ఫ్యాకల్టీని అప్పటి సీఎం కేసీఆర్ నియమిస్తే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 6000 మందిని తొలగించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.