సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన తుడుం హన్స్ అనే 30 నెలల బాలుడు మంగళవారం రాత్రి మృతి చెందడంతో వైద్యాధికారులు మండల వైద్యాధికారి స్రవంతి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మంగళవారం ఉదయం జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కు తీసుకువెళ్లామని తల్లిదండ్రులు తుడుం రవళి అజయ్ తెలిపారు.