మాజీ సీఎం కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టర్లు వెలిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్షనేత అంటూ వాల్ పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేవలం ఖమ్మం, తెలంగాణలో సంభవించిన వరదలతో జనం అవస్థతలు పడుతుంటే కూడా కేసీఆర్ స్పందించలేదని ఈ తరహా ప్రచారం చేస్తున్నారు కొందరు. ఈ తరహా ప్రచారాన్ని చేస్తూనే కాంగ్రెస్ నేతల్ని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.