తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామ శివారు న అక్రమంగా నిర్వహిస్తున్న సారాబట్టీపై దాడులు నిర్వహించామని ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఈ దాడిలో 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. సుందరపల్లి శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 40 లీటర్ల సారా స్వాధీనం అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.