తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లో నేటి నుంచి ఈనెల 8వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఇంకో డేంజర్ తమను ముంచేందుకు వస్తోందంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.