శ్రీసత్యసాయిజిల్లా : హిందూపురం పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా లక్ష్మీ గంగాధర్‌ను ఎంపిక చేసినట్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు కరణం నగేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ చేతుల మీదుగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా లక్ష్మి గంగాధర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.