నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్యాల మండలం తక్కలపల్లి గ్రామంలో జరిగింది. తక్కళ్లపల్లికి చెందిన భాగ్యలక్ష్మిని మ్యాడంపల్లికి చెందిన తడగొండ దినేష్‌తో గత నెల 18న వివాహం జరిపించారు. హైదరాబాదులో స్థిరపడిన వరుడి కుటుంబం నుంచి మంగళవారం సాయంత్రం యువతి పుట్టింటికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం తన చావుకు ఎవరూ కారణం కాదని చేతి పై రాసుకుని బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.